ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

bsbnews
0

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 

కందుకూరు (గుడ్లూరు) సెప్టెంబర్ 21 

BSBNEWS - GUDLURU [21/09/24] 






రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం 2వ రోజు కార్యక్రమం గుడ్లూరు గ్రామంలో శనివారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద ప్రజా వేదిక జరిగింది.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ  100 రోజుల ఎన్డీఏ పాలనలో  సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుందన్నారు. అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డీఎస్సీ, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,  వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. సుపరిపాలన అందించటమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కొత్త ప్రభుత్వంలో పంచాయతీలు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయని, గుడ్లూరు పంచాయతీకి ఇటీవల 15 లక్షల రూపాయలు విడుదలయ్యారని ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన సుమారు 400 ఇళ్లకు బిల్లులు రావాల్సి ఉందని, అవన్నీ త్వరలోనే క్లియర్ అవుతాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులు కూడా చెల్లించమని ఆదేశాలిచ్చిన గొప్పనేత చంద్రబాబు అని తెలిపారు. గ్రామాల్లో మూడు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ఇల్లు లేని పేదలకు త్వరలో స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్ డి ఎస్ ఎస్ ద్వారా గ్రామాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు మార్చడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని వారిపై పెట్టిన అక్రమ కేసులను డిసెంబర్ నెలలోగా  రద్దయిపోతాయని అన్నారు. ప్రజలను పదేపదే ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా పనులు చేయాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. న్యాయమైన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని, ప్రతి విషయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. అంతకుముందు గుడ్లూరు బస్టాండ్ సెంటర్లో పలువురు ఇళ్లకు వెళ్లి, వందరోజుల పాలన ప్రగతిని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గుడ్లూరుతో పాటు మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో గుడ్లూరు జనసంద్రంగా మారింది. ఈకార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసిల్దార్ స్వర్ణ, ఉపాధి హామీ పథకం ఏపీడి బాబురావు, పశుసంవర్ధక శాఖ ఏడి సురేష్, వివిధ శాఖల అధికారులు, మండల టిడిపి అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, సర్పంచ్ పాలకీర్తి శంకర్, ఎంపీటీసీలు చెన్నారెడ్డి వరమ్మ, గోచిపాతల స్రవంతి, గ్రామ టిడిపి అధ్యక్షుడు పువ్వాడి శ్రీనివాసులు, పార్టీ నాయకులు పువ్వాడి వేణు, రావూరి వేణు, మేకపోతులు రాఘవయ్య,  చెన్నారెడ్డి మహేష్, దామా వెంకటేశ్వర్లు, బిజెపి మండల అధ్యక్షుడు ఇన్నమూరి సుధాకర్, జనసేన నాయకులు అన్నంగి చలపతి, మూలగిరి శ్రీనివాసులు, అమిరిశెట్టి మాధవ, భైరవరపు రాజశేఖర్, కుంచాల అంకమ్మరావు, సుధాకర్, శివ, మాలకొండయ్య, శంకర్, మండలంలోని పలు గ్రామాల టిడిపి నేతలు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)