రాజకీయాలు మాకు అనవసరం అభివృద్దే మా నినాదం

bsbnews
0

 రాజకీయాలు మాకు అనవసరం  అభివృద్దే మా నినాదం

BSBNEWS - KANDUKUR [24/09/24] 


రాజకీయాలు మాకు అనవసరం  అభివృద్దే మా నినాదం అని, కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అభివృద్ధి కమిటీ పని చేస్తుందని అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షులు దివి శివరాం అన్నారు. స్థానిక వెంగమాంబ ఫంక్షన్ హాలులో సామాజిక వేత్త పాలేటి కోటేశ్వరరావు అధ్యక్షతన కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకులు దివి శివరాంను అధ్యక్షులుగా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దివి శివరాం మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో అందరినీ సమన్వయపరచుకొని అభివృద్ధికి గొంతుకగా, ఐక్యంగా నిలదిస్తామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రతినిధులను ప్రజాసంఘాలను, న్యాయవాదులను, ఉపాధ్యాయులను, మేధావులను ప్రతి ఒక్కరిని ఈ అభివృద్ధి కమిటీలో సభ్యులుగా చేర్చుకొని అందరి సలహాలు, సూచనల మీద అభివృద్ధి కమిటీ పని చేస్తుందని ఆయన అన్నారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలు తప్ప రాజకీయాలు ప్రస్తావిస్తే ఆ క్షణమే నేను అభివృద్ధి కమిటీలో ఉండబోనని ఆయన అన్నారు. కందుకూరు అభివృద్ధి కమిటీ విషయం ప్రస్తావించినప్పటి నుండి కందుకూరులో టిడిపికి వ్యతిరేక కమిటీ ఏర్పడుతుందని ప్రచారం జోరుగా సాగుతుందని అది తప్పు అని ఆయన అన్నారు. నేను ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీనే అని, దుష్ప్రచారాలు ఎవరు నమ్మవద్దని ఆయన అన్నారు.  అభివృద్ధి కమిటీలు కేవలం కందుకూరులోనే కాదు అన్నిచోట్ల ఉన్నాయని అంతమాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి,మాలకొండయ్య మాట్లాడుతూ కందుకూరు నుండి పలు రకాల పనుల కోసం అనేకమంది వలసలు పోతున్నారని వలసలు ఆగాలంటే కందుకూరు అభివృద్ధి జరిగి కందుకూరు ప్రజలకు ఉపాధి అవకాశాలు రావాలని ఆయన అన్నారు. కందుకూరి అభివృద్ధికి మేము ఎప్పుడు ముందుంటామని మా సహాయ సహకారాలు కందుకూరు అభివృద్ధి కమిటీకి ఉంటాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం మన కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉండటం వలన వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు రాలేదని, కందుకూరు ప్రకాశం జిల్లాలోనే ఉంటే కందుకూరుకు వెనుకబడిన ప్రాంతంగా కొత్త నగదు రావడం జరుగుతుందని దాంతో కందుకూరు అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఆ దిశగా కందుకూరు అభివృద్ధి కమిటీ ముందుకు సాగాలని కోరారు. వైసిపి పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ మాట్లాడుతూ కందుకూరు ప్రాంత నివాసులకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే త్వరతగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కందుకూరు అభివృద్ధి కమిటీ ఆ వైపుగా అడుగులు వేసి అనేక పనులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చార్టెడ్ అకౌంటెంట్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ కందుకూరు అభివృద్ధి కమిటీ కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. కందుకూరు అభివృద్ధి కమిటీ సమావేశానికి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ లతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులను పిలవడం జరిగిందని వారు కూడా త్వరలో కందుకూరు అభివృద్ధి కమిటీలో భాగస్వాములు అవుతారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి సలహా సూచనల మేరకు కందుకూరు అభివృద్ధి కమిటీ ముందుకు సాగుతూ రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా ఉంటుందని ఆయన తెలిపారు. కందుకూరు అభివృద్ధి కమిటీ లో రాజకీయాలు మాట్లాడిన ఏ ఇతర వ్యక్తిగత విషయాలపై ప్రచారాలు చేసిన వారిని వెంటనే కమిటీ నుండి తొలగించడం జరుగుతుందని తెలిపారు. రాళ్లపాడు రిజర్వాయర్ సమస్య కందుకూరులో జఠిలమైనదని ఆ సమస్యను పరిష్కరించే దిశగా అభివృద్ధి కమిటీ పని చేసి రైతులకు న్యాయం చేకూరుస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతర బోయిన నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కందుకూరు అభివృద్ధి కోసం ఎప్పుడూ ముందుంటుందని కందుకూరు అభివృద్ధి కమిటీ ఇప్పటికైనా ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కందుకూరు అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కమిటీకి సహాయ సహకారాలు అందించటం తో పాటు పనిచేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పొడపాటి శ్రీను, పులిచెర్ల వెంకట సుబ్బారెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు బూసి సురేష్ బాబు, షేక్ హుస్సేన్, వైసిపి నాయకులు ముప్పరపు కిషోర్, రేణమాల అయ్యన్న, ప్రజా సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టు ఉప్పుటూరి మాధవరావు, కాకుమాని మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)