పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి
BSBNEWS - VALETEVARIPALEM
వర్షాకాలంలో పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని పోకూరు పశు వైద్యాధికారి వంశీ అన్నారు. మండలంలోని పోకూరు పశు వైద్యశాలలో పశువులకు కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి టీకాలను చేస్తున్నామన్నారు. గ్రామాల్లో పశువులకు వ్యాధులు ప్రబలిన సమయంలో పశు పోషకులు సమస్యలను సిబ్బంది తీసుక రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణాంక అధికారిణి బి.అనుపమ, ఏ హెచ్ లు అశోక్,మహిత తదితరులు పాల్గొన్నారు.