కొండముడుసుపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్

bsbnews
0

 కొండముడుసుపాలెం  వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి - సిపిఐ డిమాండ్ 

BSBNEWS - KONDAMUDESEPALEM [24/09/24] 

నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా కందుకూరు నుండి గుడ్లూరు వెళ్లే రహదారిలో కొండముడుసుపాలెం  వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరు మాలకొండయ్య అన్నారు. మంగళవారం కందుకూరు సిపిఐ సమితి ఆధ్వర్యంలో కొండముడుసుపాలెం నేషనల్ హైవే వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య మాట్లాడుతూ కందుకూరు నుండి కావలికి వెళ్లే రహదారిలో అనేక గ్రామాలు ఉన్నాయని ఆ గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న పనిపై ఆ రహదారిలోనే కందుకూరికి వస్తుంటారని వారితో పాటు ఆర్టీసీ బస్సులు తదితర వాహనాలు తిరుగుతుంటాయని అటువంటి సందర్భంలో అక్కడ ఏర్పాటు చేస్తున్న నేషనల్ హైవే లో భాగంగా కొండముడుసు పాలెం సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపడితే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు. వాహనాలతో పాటు అక్కడ రైతులకు సంబంధించిన పొలాలు ఉన్నాయని, రైతులు కూడా వారి పొలాలకు ఎప్పుడు వెళ్తుంటారని, వెళ్లే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. బ్రిడ్జి నిర్మాణం లేకపోతే రానున్న రోజుల్లో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయడం లేదని సంబంధిత అధికారులు కేంద్రానికి పంపించడం జరిగిందని దానిని కేంద్రం పునరాలోచించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వారు అన్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే భవిష్యత్తులో రైతులను కలుపుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేయటం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై ఆనందమోహన్, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్ హుస్సేన్,  సిపిఐ నాయకులు గౌడ పేరు రాము, యువజన నాయకులు హరిబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)