వరద బాధితుల కోసం విరాళాలు
కందుకూరు (గుడ్లూరు)సెప్టెంబర్ 21
BSBNEWS - GUDLURU [21/09/24]
విజయవాడ వరద బాధితుల కోసం గుడ్లూరు మండలానికి చెందిన దాతలు శనివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడ్లూరు మండల తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ముఖ్యనేతలు కలిసికట్టుగా 24,040 రూపాయలు విరాళాన్ని అందించారన్నారు. మండల బిజెపి అధ్యక్షుడు ఇన్నమూరి సుధాకర్, తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా 1,016 రూపాయలు అందించారని అన్నారు. అనంతరం దాతలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, బిజెపి అధ్యక్షులు ఇన్నమూరి సుధాకర్, జనసేన నాయకులు అన్నంగి చలపతి, మూలగిరి శ్రీనివాసులు, అమిరిశెట్టి మాధవ, భైరవరపు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.