పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

0

 పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

 BSBNEWS - KANDUKUR [12/9/24] 

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని సూపర్వైజర్ లక్ష్మీ దేవమ్మ అన్నారు. పట్టణంలోని సాయి నగర్ అంగన్వాడీ కేంద్రంలో  పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాల్గొన్న సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ గర్భవతులు వివిధ రకాల ఆహారాన్ని వివేకంతో ఎంచుకొని వినియోగించుకోవాలని అన్నారు. పాలు ఇచ్చేటప్పుడు  తల్లులు అదనపు ఆహారంతో పాటు పలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పౌష్టికాహారమైన ఆకు కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకుంటే బిడ్డకు పాలు సక్రమంగా ఇవ్వగలుగుతారని అన్నారు, పౌష్టికాహారాలు ఏడు రకాలైన మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు తో పాటు నీళ్లు తగినంత తీసుకోవాలని అన్నారు. పౌష్టికాహారం విషయంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడి కార్యకర్తలు ఇచ్చే సూచనలను గర్భవతులు, బాలింతలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు వి.శారద, ఏ.అరుణ,  సి.హెచ్.ఉషారాణి, పి.ఝాన్సీ రాణి,  కె.అరుణ, కె.పద్మావతి, తల్లులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)