ఉపాధిలో వంద శాతం పండ్ల తోటలను సాగు చేపట్టాలి - ఇన్చార్జ్ ఎంపిడివో వెంకటేశ్వరరావు

bsbnews
0

 ఉపాధిలో వంద శాతం పండ్ల తోటలను సాగు చేపట్టాలి -ఇన్చార్జ్ ఎంపిడివో వెంకటేశ్వరరావు

BSBNEWS - KANDUKUR [23/09/24] 

రైతులు పండ్ల  తోటల సాగును  చేపట్టాలని ఎంపీడీవో వెంకటేశ్వరావు అన్నారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాల ప్రకారం ఎంపిడిఓ  కార్యాలయంలో చిన్న, సన్న కారు రైతులకు అవగాహన సదస్సు సోమవారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి 5 ఎకరాల లోపు కలిగిన చిన్న సన్న కారు రైతులకు సంబంధించి ఉపాధి హామీ పథకం లో 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటలు పెంపకం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం తరఫున మామిడి, జామ, నిమ్మ, డ్రాగన్, మునగ తోటలను మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.  బండ్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకం తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ఎపిడి బాబురావు , ఉద్యాన అధికారి బ్రహ్మతేజ, ఏవో వి రాము , ఏపీవో సుజాత, గ్రామ కార్యదర్శులు, రైతులు, ఉపాధి సిబ్బంది  పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)