సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - VALETIVARI PALEM [14/9 / 24]
వలేటివారిపాలెం వడ్డెరకాలనీలో శనివారం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణానికి దూరప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా తరలిరావడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది అని అన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, మాజీ అధ్యక్షుడు పరిటాల భాస్కర్, కాలనీ పెద్దలు బత్తుల సుబ్బారావు, చెంచయ్య, ఇర్ల లక్ష్మీనారాయణ, ప్రసాద్, గండికోట నవీన్, టిడిపి నాయకులు వలేటి మధు, నరసింహం, కాకుమాని మాల్యాద్రి, మన్నం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.