రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సీఐ
BSBNEWS - ULAVAPADU [28.09.2024]
మండలంలోని బద్దిపూడి గ్రామంలో రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు కందుకూరు సిఐ కె వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా గ్రామంలో ఇటువంటి దొంగతనాలు సైబర్ నేరాలు జరిగిన వెంటనే పట్టుకోవడంతోపాటు ప్రజలకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. గ్రామంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఏదైనా ఆపద సమయంలో 100, 112, 1098 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారని ఆయన అన్నారు. మహిళలకు సంబంధించిన విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.