వ్యాపారస్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
BSBNEWS - KANDUKUR
పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిరంతరించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో వ్యాపారస్తులు సైతం సహకరించాలని కందుకూరు పట్టణ ఎస్సై వి.సాంబయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అనేకమంది ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, పలు రకాల వస్తువులను తీసుకొని వెళ్ళటానికి వస్తుంటారని వచ్చిన సందర్భంలో తమ వాహనాలు ప్రభుత్వం వారు సూచించిన ఫుట్ పాత్ లపై కాకుండా రోడ్ల వెంబటి పెట్టడంతో ట్రాఫిక్ సమస్య కావడానికి ప్రధాన కారణం అవుతుందని ఆయన అన్నారు. వాహనదారులు ఫుట్పాతులపై వాహనాలు నిలిపేందుకు వ్యాపారస్తులు సహకరించాలని లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రైవేటు వాహనాలు సైతం రాత్రి సమయంలో వారికి సూచించిన ప్రదేశంలో తప్ప ప్రధాన కూడలి లో పార్కింగ్ చేయకూడదని అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయితే కందుకూరు ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆయన అన్నారు.