ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి 8 అర్జీలు
BSBNEWS - KANDUKUR 7/10/24
కందుకూరు పురపాలక సంఘం కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల, డయల్ యువర్ కమిషనర్ కు 8 అర్జీలు వచ్చినట్లు కె. అనూష తెలియజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదులు కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని పరిశీలించి త్వరతగతిన సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని పారిశుద్ధ్య, వగైరా సమస్యల కొరకు కార్యాలయం నెం.9177700267 ఫోన్ ద్వారా కూడా తెలియజేయవచ్చునని తెలిపి అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.