పలు దేవాలయాల్లో దామచర్ల సత్య ప్రత్యేక పూజలు

bsbnews
0

పలు దేవాలయాల్లో దామచర్ల సత్య ప్రత్యేక పూజలు 

BSBNEWS - KONDEPI 



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మారిటైం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య కు అవకాశం కల్పించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో దామచర్ల సత్య పాల్గొన్నారు.  మొదటగా తన పెదనాన్న, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ తల్లిదండ్రులైన దామచర్ల వెంకట కృష్ణారావు - రత్తమ్మ లను టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామంలో కలసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత గ్రామంలోని శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజలు సత్య పాల్గొన్నారు.  ఆ తర్వాత జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో దామచర్ల సత్య ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దామచర్ల సత్య కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారి దామచర్ల సత్యకు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవస్థానంలో పరమశివుడు కు  అభిషేకం నిర్వహింఛారు. ఆలయ అర్చకులు రాష్ట్ర మారిటైం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య ను తాళమేళాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, దామచర్ల కుటుంబ అభిమానులు సత్య వెంట ఉన్నారు. 


Post a Comment

0Comments
Post a Comment (0)