రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను ఆదుకోవాలి

0

 రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులను ఆదుకోవాలి 

BSBNEWS - KANDUKUR 

టిడ్కో ఇళ్ళు స్వాధీనం చేసుకుంటున్న బ్యాంకర్లు నుండి లబ్ధిదారులని ఆదుకోవాలని సిపిఐ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి బి సురేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రుణమాఫీ అవుతాయనే భ్రమలో ఉండి నిండా మునిగిన టిడ్కో గృహాల లబ్దీదారులు ప్రభుత్వం ఆదుకోవాలని పేదల భ్రమను, ఆశను అవకాశంలా మలుచుకుని ప్రభుత్వాలు ఓట్లు దండుకున్నాయని ఆరోపించారు.చంద్రబాబు మానస పుత్రికలైన టిడ్కో ఇల్లు నేడు జప్తునకు గురవుతున్న పరిస్థితికి వచ్చాయని అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో పేదల కలల సౌధాలుగా పేరు గాంచిన ఆ ఇల్లు ఇప్పుడు బ్యాంకర్ల గుప్పెట్లోకి వెళ్తున్నాయన్నారు. ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తారనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ళు తీసుకున్నామని ఇంత ప్రమాదం ఉంటుందని ఊహించలేదని టిడ్కో లబ్దీదారులు వాపోతున్నారు.2014న చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ టిడ్కో ఇళ్ళకు పునాదులు పడ్డాయని, చంద్రబాబు సంకల్పించిన సంక్షేమం కనుక ఆ ఇల్లు ఏదో ఒక రూపాన రుణమాఫీ అవుతుందని ఆశతో పేదలు ఆశించారన్నారు. ఆ ఆశతోనే ఎనభై శాతం మంది లబ్దీదారులు ఇంటి లబ్దీకి ఆరోజున ముందుకు వచ్చారన్నారు. పునాదుల సమయంలోనే వేలకు వేలు డిపాజిట్ లు కట్టి ఏడేళ్ల తర్వాత ఇళ్ళులు పొందారన్నారు. గతంలో ప్రభుత్వ హౌసింగ్ లో కాలనీ ఇళ్ళు వచ్చినట్టు గానే తిరిగి కట్టే పనిలేదనుకునే భ్రమలో పేద ప్రజలు ఉన్నారని, అందుకు ఆజ్యంగా టిడ్కో ఇళ్ళు పూర్తి కావస్తున్న సమయంలో అప్పటి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 2018 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చే ఇల్లు తీసుకోండి అయితే ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కట్టొద్దు అని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇల్లు ఉచితంగా ఇస్తానని ఆ ఎన్నికల ప్రచారంలో నమ్మబలికారు. ఆశపడిన పేద లబ్దీదారులు జగన్ కు 2019లో ఎన్నికల్లో బ్రహ్మ రథం పట్టారన్నారు. అధికారం లోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జగన్ టిడ్కోలో తక్కువ శాతం ఇల్లు అయిన 300 గజాల ఇళ్లను ఉచితం చేసి 70 శాతం పైనే ఉన్న 365, 430 ఇళ్లకు డబ్బులు కట్టే విధంగా మలిచి వాళ్ళ నెత్తిన బ్యాంకు లోన్లు పెట్టించి ఇచ్చిన హామీని మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు టిట్కో గృహాలను రుణమాఫీ చేస్తామని లబ్ధిదారులకు హామీ ఇవ్వడంతో మరల పేద ప్రజల జీవితాల్లో ఆశలు పుట్టి మరల 2024 ఎన్నికలలో చంద్రబాబును గెలిపించడం జరిగిందని ఇప్పుడు బ్యాంకులో లబ్ధిదారుల నుండి గృహాలను స్వాధీనం చేసుకుంటుంటే చూస్తూ ఉండిపోతున్నారన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బ్యాంకుల నుండి లబ్ధిదారులను కాపాడాలని లేనిపక్షంలో లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కొంతమంది ఇల్లు బ్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారని ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)