మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సీఐ కే. వెంకటేశ్వరరావు

0

మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన సీఐ కే. వెంకటేశ్వరరావు 

BSBNEWS - KANDUKUR [5.10.2024]

యువత మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉంటుందని కందుకూరు సీఐ కె వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్ లో మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేశారంటే పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ఉంటుందని ఆయన అన్నారు. పిల్లలను గారాభం చేసే క్రమంలో వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతుందని ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించి సైబర్ నేరాలను అరికడదామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించాలని, ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదంలో అనుకోని సంఘటన జరిగితే అది ఆ ఒక్కరితో పోదని దాని ప్రభావం వారి కుటుంబం మొత్తం మీద పడుతుందని దానిని గమనించి ప్రతి ఒక్కరు పోలీసు వారు సూచించిన జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎడ్వర్డ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)