డక్కన్ బ్రాడ్ బ్యాండ్, ప్రొప్రైటర్ కె.రవికుమార్ ను అభినందించిన ఎంఈఓ
BSBNEWS - VALETIVARIPALEM
మండలంలోని పోలినేనిపాలెం ఎంపీపీ స్కూల్ నందు శుభదిన్ భోజన్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులందరికీ హెచ్.ఎం.కె సామియేలు ఆధ్వర్యంలో కందుకూరు డక్కన్ బ్రాడ్ బ్యాండ్ ప్రొప్రైటర్ కె.రవికుమార్ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి- 2 ఏ.మల్లికార్జున పాల్గొని మాట్లాడుతూ రవి తమ దాతృత్వ హృదయంతో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రవిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు వారి ఉన్నత చదువులకు ఉపయోగపడే విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. అనేకమంది పుట్టినరోజు వేడుకలను ఇతరత్రా వేడుకలకు ఆర్భాటాలకు పోయి ఎంతో ఖర్చు చేస్తారని, అలా ఖర్చు చేసే ప్రతి రూపాయలు పేద విద్యార్థుల సౌకర్యార్థం వినియోగిస్తే విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇచ్చిన వారవుతారని ఆయన అన్నారు. విద్యార్థులు సైతం దాతల సహకారంతో బాగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. అనంతరం రవిని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.