సిపిఎం ఉలవపాడు కార్మిక శాఖాకార్యదర్శి గా ఎస్. డి గౌస్ భాషా ఎన్నిక

0

 సిపిఎం ఉలవపాడు కార్మిక శాఖాకార్యదర్శి గా ఎస్. డి గౌస్ భాషా ఎన్నిక

BSBNEWS - ULAVAPADU 


సిపిఎం ఉలవపాడు కార్మిక శాఖా కార్యదర్శి గా ఎస్. డి గౌస్ బాషా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జివిబి కుమార్ తెలిపారు. శనివారం సిపిఎం కార్మిక శాఖా మహాసభ ఇందిరావతి అధ్యక్షతన జరిగింది. మహాసభకు పరిశీలకులుగా మండల పార్టీ కార్యదర్శి జీవీబీ కుమార్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం ఈనెల 15 తర్వాత ప్రచారోధ్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఉలవపాడులో అర్హత అంగన్వాడి ఆటో పంచాయతీ కార్మికులకు  ఇండ్ల స్థలాలు ఇచ్చి శ్రామిక నగర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, వీటిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. కార్మికులు ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్మిస్తామని తెలిపారు. ఈ శాఖా మహాసభలో సిపిఎం నాయకులు ఎస్. డి. జహీర్, ఎస్.కె సుల్తాన్, కొమరగిరి శేషమ్మ తోపాటు ఆటో, అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)