గాంధీ జయంతికి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మున్సిపల్ కమిషనర్
BSBNEWS - KQNDUKUR [2/10/24]
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని కందుకూరు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను మున్సిపల్ కమిషనర్ కే అనూష సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుకూరు మున్సిపాలిటీ ప్రజల ఆరోగ్య విషయంలో పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని వారిని సన్మానించుకోవడం మన కర్తవ్యం అని ఆమె అన్నారు. ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాకుమాని రవణమ్మ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల పట్ల మున్సిపల్ కమిషనర్ చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు మేము ఎప్పుడు బాధ్యులమై ఉంటామని ఆమె అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆమడ దూరంలో ఉంటే అధికారులను ఎంతోమందిని చూశామని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించి వారిని అక్కున చేర్చుకున్న అధికారులలో కే.అనూష ముందంజలో ఉంటుందని ఆమె అన్నారు. మున్సిపల్ కమిషనర్ సన్మానించిన వారిలో పులి నాగేశ్వరరావు, ఏలూరి మాలకొండయ్య, ఎరుసు రాజు, మానికల అంకమ్మ రావు, పొట్లూరి నాగయ్య లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ ఐ రాము, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.