మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BSBNEWS - K ANDUKUR
కందుకూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శనివారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పి పి ఈ కిట్ల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన కర్తవ్య నిర్వహణ శ్లాగనీయమన్నారు. శానిటేషన్ వర్కర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అవ్యాజమైన ప్రేమ ఉందన్నారు. పారిశుధ్య కార్మికులకు ఏ కష్టం వచ్చినా, తాము అండగా ఉంటామన్నారు.కందుకూరు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చోట నూతన డస్ట్ బిన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్ను వేసిన విధానాన్ని ఆయన దుయ్యబట్టారు. చెత్త పన్నును ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలగించారని గుర్తు చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. మునిసిపల్ కమీషనర్ అనూష మాట్లాడుతూ, స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేసినట్లు ఆమె చెప్పారు. వారికి పారిశుద్ధ్యం పై స్లొగన్స్, వ్యాసరచన పోటీలు నిర్వహించి మెమొంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు ముచ్చు శ్రీను, షేక్ రఫీ, వడ్డెళ్ళ రవిచంద్ర, ఇతర నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.