బ్రిడ్జి కోసం రోడ్ ఎక్కిన కొండముడుసు పాలెం గ్రామస్తులు గ్రామస్తులకు మద్దతు తెలిపిన సిపిఐ

0

 బ్రిడ్జి కోసం రోడ్ ఎక్కిన కొండముడుసు పాలెం గ్రామస్తులు  గ్రామస్తులకు మద్దతు తెలిపిన సిపిఐ

BSBNEWS - KONDAMUDESEPALEM [2/10/24]



 

నెల్లూరు జిల్లా కందుకూరు నుండి గుడ్లూరు వెళ్లే రహదారిలో నిర్మిస్తున్న నేషనల్ హైవే లో భాగంగా కొండముడుసు పాలెం గ్రామం ప్రారంభం వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని కొండముడుసు పాలెం గ్రామస్తులు బుధవారం రోడ్డుకి ఇరువైపులా వాహనాలను అడ్డుపెట్టి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. కందుకూరు నుండి గుంటూరు వెళ్ళే రహదారిలో అధిక శాతం వాహనాలు తిరుగుతుంటాయని వాటికి తోడు చుట్టుపక్కల ఉన్న పొలాలకు రైతులు ప్రతినిత్యం వెళుతుంటారని అటువంటి సందర్భంలో అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయకుండా హైవేని పూర్తిచేస్తే ప్రతిరోజు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రధాన రహదారులు నిర్మించే క్రమంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కాంట్రాక్టర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్న కేవలం కాంట్రాక్టుల స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎక్కడి న్యాయం అని ప్రశ్నించారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు వద్దకు మా సమస్యను తీసుకెళ్లామని వారితోపాటు కేంద్రం దృష్టికి సైతం తీసుకువెళ్లామని అక్కడి నుండి అనుమతులు వచ్చేవరకు హైవే నిర్మాణ పనులు నిలిపివేయాలని వారు కోరారు. ధర్నా వలన అడ్డుగా వెళ్లే వాహనాలు దాదాపు అటు ఇటుగా రెండు కిలోమీటర్ల మీద ఆగిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న కందుకూరు సిఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినా గ్రామస్తులు వినకపోవడంతో సమస్యను సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు ఫోను ద్వారా తెలిపారు. దాంతో సబ్ కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరసనలు చేయాలి గాని అందరిని ఇబ్బంది పెట్టే విధంగా రోడ్డును అడ్డగించటం సరికాదని తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాలను విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడపాటి మహేష్, కొండలరావు, తోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసిసురేష్ బాబు, గ్రామస్తులు, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)