కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన దుర్గామాత

0

కరెన్సీ నోట్లతో దర్శనమిచ్చిన దుర్గామాత

BSBNEWS - కందుకూరు [11-10-2024]


పట్టణంలోని కోవూరు రోడ్ లో వెలసి ఉన్న దుర్గా భవాని దేవస్థానం నందు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ కమిటీ వారు లక్ష్మీదేవి అలంకరణకు రూ 20,40,000/- రూపాయల కొత్త నోట్లతో అమ్మవారి అలంకరణ వైభవంగా చేశారు. కరెన్సీ నోట్లతో శ్రీ దుర్గా మాత దర్శనము ఇవ్వడంతో భక్తులు భక్తితో పరవశించిపోయారు. ఆలయ అర్చకులు కోవూరు మాధవరావు స్వామి అమ్మవారికి అష్టోత్తరం, కుంకుమ పూజ  నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వామి మాట్లాడుతూ ఆరవ రోజు లక్ష్మీదేవి రూపంలో భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని, అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి, కందుకూరు ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)