చిన్న పవని లో పొలం పిలుస్తుంది
BSBNEWS - CHINNAPAVANI
మండలంలోని పెంట్రాల, చిన్నపవని రైతు సేవ కేంద్రాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో అబ్రహం లింకన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ చేయించుకోవాలని అన్నారు. ఈ పంట నమోదు చేయించుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలియజేశారు. పశు సంరక్షణ సహాయకులు సన్నీ మాట్లాడుతూ రైతులు పశువులకు రుణాలు పొందుటకు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రేమ్ బాబు, రేణుక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.