స్కానింగ్ సెంటర్ లు తనిఖీ చేసిన ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం. ప్రియంవద
BSBNEWS - KANDUKUR [3/10/24]
నెల్లూరుజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అదేశాల మేరకు ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం. ప్రియంవద పట్టణంలోని డాక్టర్ కోటిరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సంకల్ప హాస్పిటల్ , అజ్మల్ నర్సింగ్ హోమ్ , ప్రగతి డాక్టర్ దన్యాసి మాలకొండయ్య హాస్పిటల్, ప్రశాంతి నర్సింగ్ హోమ్ స్కానింగ్ సెంటర్ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. అలాంటివి ప్రోత్సహించకూడదని, పుట్టబోయేది ఆడ మగ బిడ్డ అని అడగకూడదని సూచించారు. పి.సి.పి.ఎన్.డి.టి 1994 చట్ట ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని చెప్పారు. అలాంటివినేరమని అలా చేసిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. రికార్డులను పరిశీలించి ప్రతి నెల స్కానింగ్ వివరాలను ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసి ప్రతి నెల 2వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికార కార్యాలయానికి నివేదికలను పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ షేక్ ఆరిఫుల్లా పాల్గొన్నారు.