నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన
BSBNEWS - నెల్లూరు, అక్టోబర్ 5
నగరంలోని హరినాథ పురం సమీపంలోని గుర్రాలమడుగు సంఘం వద్ద సర్వేపల్లి కాలువను మంత్రి నారాయణ పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. రంగనాయకుల పేటలో పినాకిని పార్కును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ బుడమేరు తరహా వరద ముప్పు నెల్లూరు నగరంలో వాటిల్లకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. గతంలో ఎంత మేర విస్తీర్ణంలో పంట కాలువలు ఉన్నాయో అంత విస్తీర్ణం ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరితో చర్చించి పక్కా ప్రణాళికతో నగరంలోని అన్ని పంట కాలువల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. నిరుపేదలకు ఎలాంటి నష్టం లేకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపించి ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.