అక్రమ ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు

0

 అక్రమ ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోద

BSBNEWS - LINGASAMUDRAM 

మండలంలోని అన్నెబోయినపల్లి మన్నేరు వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ మహబూబ్ సుభాని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్నేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో అన్నెబోయినపల్లి మన్నేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లు ను తన సిబ్బంది సహాయంతో అన్ని బోయినపల్లి గ్రామ శివారులో అదుపులోకి తీసుకుని సదరు ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)