ఘనంగా పోషణ మహోత్సవాలు ముగింపు
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని పడమర మంగళ పాలెంలో ఉన్న యానాది కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీఓ కె.శర్మి ష్ట ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత నెలరోజులపాటు జరుగుతున్న పోషణ మహోత్సవాలు నేటితో ముగుసాయని అన్నారు. ప్రతి గర్భవతి బాలింతలకు పోషణ ఆహారం వలన కలిగే లాభాల గురించి అంగన్వాడి కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అంగన్వాడి కార్యకర్తలు సూచించిన అన్ని సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ పౌష్టికాహార లోపం లేని పిల్లలను తయారు చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. పోస్ట్కాహారాలైన ఆహార పదార్థాలను తీసుకోవడంలో ఎవరు నిర్లక్ష్యం చేయొద్దని, అలా చేస్తే పూర్తి నష్టం ఆ కుటుంబానికి జరుగుతుందని ఆమె అన్నారు. పౌష్టికాహార లోపం లేని చిన్నారులు తయారు చేయటమే అంగన్వాడి కేంద్రాల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలు, గర్భవంతలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.