దామచర్ల సత్యకు శుభాకంక్షలు తెలిపిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - KANDUKUR
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్యకి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు విజయవాడలోని వారి ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలతో పాటు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, కందుకూరు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, అల్లం వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.