వరద బాధితులకు చిన్నారుల పెద్ద సాయం

0

 వరద బాధితులకు చిన్నారుల పెద్ద సాయం 

BSBNEWS - KANDUKUR 


 విజయవాడలో ఇటీవల జరిగిన వరద ముప్పుకు గురైన వరద బాధితులకు తమ వంతు సాయంగా 23,500 రూపాయలను ఎన్. హృత్విక (9), ఎన్. నవిష్క లు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో పక్కవారికి సహాయం చేయాలన్న ఆలోచన రావటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. వరద బాధితులకు సహాయం చేయాలని ఈ చిన్నారులు వారి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో సహా పక్కవారిని అడిగి మరి కూడబెట్టిన 23,500 రూపాయలను సీఎం ఫండ్ రిలీఫ్ కు అందజేయటం సంతోషంగా ఉందన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)