ఓగురులో పొలం పిలుస్తుంది
BSBNEWS - OGURU 9/10/24
మండలంలోని ఓగూరు, వెంకటాద్రి పాలెం గ్రామాలలో మండల వ్యవసాయాధికారి వి. రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వి రాము మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలన్నింటిని ఒకే చోటికి తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అని తెలియజేసారు. పలుకూరు, మహాదేవపురం, మోపాడు (పి ఎ సి ఎస్ ),ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామాలలో ఎరువులను జిల్లా మార్క్ ఫెడ్ వారికి సంబధిత సెక్రెటరీ ఏ ఏ ఎరువులు ఎంత పరిమాణంలో కావాలో ఇండెంట్ పెట్టుకొని తద్వారా ఎరువులు తెప్పించుకోవాలని తెలియజేసారు. పంట వేసిన ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈ పంట ద్వారా పంట నమోదు చేసుకోవాలని కోరారు. తద్వారా రాబోయే రోజుల్లో పంట నష్టపోయిన, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అని తెలియజేసారు. మినుము వేసే రైతులకు మినుములు 285 పాకెట్స్ మినిట్స్ కె ఎన్ ఎం 8 రకం వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులొ వున్నాయని తెలియజేసారు. కృషి విజ్ఞాన శాస్త్రవేత్త డా.జె.జ్యోతి మినుము, శనగ వేయు రైతులు తప్పనిసరిగా సూడోమోనాస్ మరియు ట్రై కోడేర్మా విరిడి తో 10 గ్రాములు ఒక కేజి విత్తనంకు,, విత్తన శుద్ధి చేసి విత్తుకొనినచో వేరు కుళ్ళు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు అని, అలాగే ఎన్ బి జి 766 శనగలు (మిషన్ కోత రకం) కావాలసిన రైతులు కె వి కె ఆఫీసు లో సంప్రదించి తీసుకోవచ్చునని తెలియజేసారు. మాచవరం పశు వైద్యాధికారి డాక్టర్ ఈ.చెన్నకేశవలు మాట్లాడుతూ గొర్రెలు మేకలు పోషకులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద 1నుండి 4కోట్లు వరకు 50 శాతం రాయితీ తో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.వి.కె.శాస్త్రవేత్త డా.మయాంక్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి బి.లక్మి నారాయణ, ప్రకృతి వ్యవసాయ అధికారులు పి మాధవ, సి హెచ్ రాజా మరియు రెండు గ్రామాల ,గ్రామ వ్యవసాయ సహాయకులు కె శరత్ కుమార్, ఎం.నాగరాజుమరియు రెండు గ్రామాల రైతులు ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.