రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్
BSBNEWS - KANDUKUR [2/10/24]
అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు బజార్లో నల్లమల్లి వెంకటేశ్వర్లు, పబ్బిశెట్టి వరదరాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ కే అనూష ప్రారంభించారు. ఆమె ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతికి ఒక మంచి కార్యక్రమమును నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. దానాల్లో కల్లా రక్తదానం ముఖ్యమైనదని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడ్డానికి రక్తం చాలా అవసరం అవుతుందని ఆమె అన్నారు. బిజెపి పార్టీకి చెందిన కార్యకర్తలు, కందుకూరు నగర ఆర్యవైశ్య టిడిపి నాయకులు, పట్టణ టిడిపి నాయకులు మరికొంతమంది జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదాన శిబిర నిర్వాహకులు మాట్లాడుతూ 20 మంది రక్తదానం చేశారన్నారు. వారికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.