ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగితే సహించం - ఎంపీడీవో రత్నజ్యోతి

0

ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగితే సహించం  - ఎంపీడీవో రత్నజ్యోతి

BSBNEWS - KANDUKUR 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగితే సహించమని కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎంపీడీవో రత్నజ్యోతి హెచ్చరించారు. స్థానిక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ల కు అవగాహన కార్యక్రమం ఏపీవో ఎల్.వి. సుజాత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో రత్నజ్యోతి మాట్లాడుతూ అమృత్ సరోవర్ పనులు, హార్టికల్చర్ పనులు, ట్రెంచ్ పనులు, ప్రభుత్వ స్థలాలలో మొక్కల పెంపకం, చెరువుకు సంబంధించి రైతుల పొలాలకు వెళ్లే కాలువల మరమ్మత్తుల పనులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అడిగిన ప్రతి ఒక్క ఉపాధి కూలీకి పనినికల్పించాలని పేర్కొన్నారు. ఎన్ ఎం ఎం ఎస్ ఎస్ ఫొటోలు కచ్చితంగా నాలుగు పనికి వచ్చిన వారికే క్యాప్చర్ చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం పనులను కూలీలు చేత నాలుగు గంటలసేపు పని చేయించాలని ఆమె చెప్పారు. కొలతలు ప్రకారం పనిచేయాలని, పనికి తగ్గ వేతనం ను కూలీలకు వచ్చేలా చూడాలని సూచించారు. ఒకరి పేరుకు బదులు మరొకరు పనికి రావద్దని తెలిపారు. పనికి రాని కూలీలకు బోగస్ మస్టర్లను వేయకూడదని పేర్కొన్నారు. వారానికి  100 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో టి.ఏ వీరయ్య, బ్రహ్మనాయుడు, సిఓ లత, మేట్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)