కందుకూరులో రెండు రోజులు నీటికి అంతరాయం
BSBNEWS - KANDUKUR [07-10-2024]
కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 7, 8 తేదీలు అనగా సోమవారం సాయంత్రం, మంగళవారం రెండు రోజుల పాటు మంచినీటికి అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ కొర్రపాటి అనూష తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందుకూరు పురపాలక సంఘం పరిధిలోని ఎస్ ఎస్ ట్యాంక్ నందు ఏరియేషన్ ప్లాంట్ వద్ద గేట్లు మార్చడం జరుగుతుందని దాని వలన కందుకూరులో ఈనెల 7వ తేదీ, 8వ తేదీ అనగా సోమవారం సాయంత్రం, మంగళవారం రెండు రోజులపాటు మంచినీటికి అంతరాయం కలుగుతుందని పురపాలక ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.