కొండముడుసుపాలెం లో పొలం పిలుస్తుంది

0

కొండముడుసుపాలెం లో పొలం పిలుస్తుంది

BSBNEWS - KONDAMUDESEPALEM [3/10/24] 

 కందుకూరు మండలంలోని కొండముడుసు పాలెం, కంచర గుంట గ్రామాలలో మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వి రాము మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలన్నింటిని ఒకే  చోటికి తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అని తెలియజేసారు. ముఖ్య అతిథిగా రాబోయే రోజుల్లో  పి ఎ సి ఎస్ , ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు  గ్రామాలలో ఎరువులను సరఫరా చేస్తారని తెలియజేసారు. పంట వేసిన ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈ పంట ద్వారా పంట నమోదు చేసుకోవాలని కోరారు. తద్వారా రాబోయే రోజుల్లో పంట నష్టపోయిన, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అని తెలియజేసారు. మినుము, శనగ వేయు రైతులు తప్పనిసరిగా ట్రై కోడేర్మా విరిడి తో 10గ్రాములు ఒక కేజి విత్తనమునకు, విత్తన శుద్ధి చేసి విత్తుకొనినచో వేరు కుళ్ళు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు అని, ప్రస్తుతం రైతులకు అందుబాటులో 200కేజీలు వ్యవసాయ కార్యాలయంలో వున్నాయని  తెలిపారు, ప్రకృతి వ్యవసాయ అధికారి డి.దనమ్మ మాట్లాడుతూ 10 నుండి 15 రకాల పప్పుదినుసులు రకాలను ప్రధాన పంటకు ముందు వేసుకొని కలియ దున్నటం వలన భూమిలో సేంద్రియ కార్బనాన్ని స్టిరీకరించవచ్చు అని తెలిపారు.తదుపరి మిరప వేసిన పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందుకూరు మండల పరిషత్ అధ్యక్షులు ఇంటూరి సుశీల, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి షేక్.ఖాసిం, ప్రకృతి వ్యవసాయ అధికారి  డిఏంఏం ,  సిహెచ్. వెంకట్ రాజా, కొంముడుసుపాలెం, కంచరగుంట గ్రామాల, గ్రామ వ్యవసాయ సహాయకులు యల్. రమా దేవి, పీ.శరత్ కుమార్, రెండు గ్రామాల రైతులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


 

Post a Comment

0Comments
Post a Comment (0)