వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే పొలం పిలుస్తోంది
BSBNEWS - MOPADU , MACHAVARAM
కందుకూరు మండలంలోని మోపాడు, మాచవరం గ్రామాలలో మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలన్నింటిని ఒకే చోటికి తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అని తెలియజేసారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కందుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు పి.అనసూయ మాట్లాడుతూ పి ఎ సి ఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో గ్రామాలలో ఎరువులను సరఫరా చేస్తారని తెలియజేసారు, పంట వేసిన ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈ పంట ద్వారా పంట నమోదు చేసుకోవాలని కోరారు. తద్వారా రాబోయే రోజుల్లో పంట నష్టపోయిన, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అని తెలియజేసారు. కందుకూరు ఉద్యానవన శాఖ అధికారి పి. బ్రహ్మ సాయి మాట్లాడుతూ ఉద్యాన శాఖలో వున్న పథకాలు, 50శాతం రాయితీతో యంత్ర పరికరాలు గురించి వివరించారు. 90 శాతం రాయితీతో డ్రిప్, 50శాతం రాయితీ తో స్ప్రింక్లర్ రైతులకు అందుబాటులో ఉన్నాయి అని, కావాలసిన రైతులు సంబధిత రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మాచవరం పశు వైద్యాధికారి డాక్టర్ ఈ.చెన్నకేశవలు మాట్లాడుతూ గొర్రెలు మేకలు పోషకులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద 1నుండి 4కోట్లు వరకు 50 శాతం రాయితీ తో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ అధికారి వి దనమ్మ మాట్లాడుతూ 10 నుండి 15 రకాల పప్పుదినుసులు రకాలను ప్రధాన పంటకు ముందు వేసుకొని కలియ దున్నటం వలన భూమిలో సేంద్రియ కార్బనాన్ని స్టిరీకరించవచ్చు అని తెలిపారు. తదుపరి గింజ దశలో ఉన్న వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి షేక్.ఖాసిం, ప్రకృతి వ్యవసాయ అధికారి డిఏంఏం, సిహెచ్. వెంకట్ రాజా, మోపాడు, మాచవరం గ్రామాల ,గ్రామ వ్యవసాయ సహాయకులు ఇ . రమణయ్య, సి హెచ్.రోనీ రెచల్ మరియు రెండు గ్రామాల రైతులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.