కందుకూరులో మరో ఇసుక యార్డును ప్రారంభిస్తున్నాం - జిల్లా కలెక్టర్ ఆనంద్
BSBNEWS - KANDUKUR 7/10/24
కందుకూరులో ఇసుక యార్డును ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం జిల్లాలో ఇసుక నిల్వలు, సరఫరాపై కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ లు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత లేదు అని, జిల్లాలోని మూడు ఇసుక యార్డులలో 70వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది అని తెలిపారు. మన జిల్లాలో ఒక టన్ను ఇసుకను రూ.350కే అందిస్తున్నామని,ప్రజల అవసరాలకంటే రెట్టింపు ఇసుక నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. కందుకూరులో మరో యార్డును ప్రారంభిస్తున్నామని తెలిపారు. త్వరలో మరో నాలుగు ఒపెన్ రీచ్‌లను ప్రారంభిస్తామని, ఇసుక కోసం ఎవరు దళారులను ఆశ్రయించవద్దు అని అన్నారు. అందరికీ అందుబాటులో ఇసుక ఉంది అని, ప్రజలందరూ ఏపి శాండ్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని ఆయన హెచ్చరించారు. ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచామన్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేయటం జరుగుతుందన్నారు. 24 గంటలూ యార్డుల వద్ద పోలీసు ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.