రాళ్లపాడు చెరువులో చాపలు పట్టేందుకు వారికి అధికారం ఎవరిచ్చారు..?
రాళ్లపాడు ప్రాజెక్టు ను అధికారులు పట్టించుకోకపోతే సీఎం దగ్గరికి పోతాం
BSBNEWS - RALLAPADU [01/10/24]
రాళ్లపాడు ప్రాజెక్టు సంబంధించి చెరువులో చాపలు పట్టేందుకు అధికారికంగా అధికారులు అనుమతులు ఇవ్వనప్పుడు రాలపాడు చెరువులో చాపలు పట్టేందుకు వారు ఎలాంటి హక్కు ఉందని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చాపల మాఫియాను ప్రశ్నించారు. మంగళవారం సిపిఐ బృందంతో ఆయన కలిసి రాళ్ళ పాడు కుడి కాలువ, ఎడమ కాలవ లను సందర్శిస్తూ రాళ్ళ పాడు ప్రాజెక్టును పరిశీలించారు. రాళ్లపాడు రిజర్వాయర్ అధికారులతో పలు అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాళ్లపాడు చెరువులో చాపలు వాటి అంతటి అవే వచ్చినప్పుడు వాటికి సంబంధించి అధికారం ఒక సొసైటీ ద్వారా ఇవ్వడం జరుగుతుందని అంతేతప్ప అధికారికంగా ఎవరు వేలంపాట వేసి వారికి హక్కులు కల్పించలేదని అలాంటి సందర్భంలో చాపల మాఫియాను ఎందుకు అధికారులు నాయకులు ప్రోత్సహిస్తున్నారో అర్థం కాని ప్రశ్నగా మారిందని ఆయన అన్నారు. ఒకవేళ సొసైటీ వారు చాపల పెంపకానికి వారు ఉంటే వారికి వచ్చే ఆదాయంలో మూడో వంతు భాగం రాళ్లపాడు రిజర్వాయర్ కు అందించాలని తద్వారా వచ్చిన ఆదాయంతో రాళ్లపాడు రిజర్వాయర్ కి సంబంధించిన పనులు, మరమ్మత్తులు చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. రాళ్లపాడు చెరువులో ఇంటను చాపలు మాఫియా కొనసాగితే పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని దానిని నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఆయన అన్నారు. రాళ్లపాడు చెరువులోని నీటిని చెరువు నుండి ఫిల్టర్ అయ్యి గ్రామంలోని ప్రజలు తాగే నీటి నమూనాలను తీసుకోవడం జరిగిందని వాటిని పరీక్షలు చేయించి తద్వారా కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన అన్నారు. కందుకూరు శాసనసభ్యులతో పాటు ఉదయగిరి శాసనసభ్యులు సైతం ఈ ప్రాజెక్టు విషయంలో చొరవ తీసుకొని రైతులకు మేలు కలిగేలా ఇద్దరు శాసనసభ్యులు చూడాలని ఆయన కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ రాళ్లపాడు లో తాగునీరు సాగునీరు కు సంబంధించి ప్రజలకు ఉపయోగకరంగా ఉందని వాటిని కలుషితం చేస్తూ చాపలు మాఫియా పెట్రేగిపోతుందని ఆయన దుయపట్టారు. రాళ్లపాడు ప్రాజెక్టు చెరువులో అధికారికంగా చేపలు పెంచేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని అయితే వారు చాపల పెంపకం పెంచుతూ దర్జాగా డబ్బులు గడుస్తున్నారని వాటిని అరికట్టేందుకు నాయకులు తో పాటు అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నారంటే వారికి ఉన్న అండదండలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏది ఏమైనా రాళ్లపాడు చెరువులో చేపల పెంపకం ఉపయోగపడేలా తగ్గించి తద్వారా తాగునీరు, సాగునీరుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాళ్లపాడు ద్వారా వచ్చే నీటిని తాగునీరు తాగునీరుగా ఉపయోగించకుండా ప్రజలకు రైతులకు ఇబ్బంది కలిగించేలా చాపల మాఫియా ఉందని వాటిపై అధికారులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా జరగకపోతే ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు ప్రజలను కలుపుకొని పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని ఆయన హెచ్చరించారు. ఎడమ కాలువ కుడి కాలువ వద్ద జంగిల్ అధికంగా ఉందని వాటిని తొలగించాల్సిన బాధ్యత అధికారులకు ఉన్న చోద్యం చూస్తూ ఉండటం ఎంతవరకు న్యాయమని ఇదే నా ప్రభుత్వానికి రైతులపై ఉన్న మధ్య ప్రేమ అని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే కాలవలు చుట్టూ ఉన్న జంగిల్ ను తొలగించి రైతులకు ఉపయోగకరంగా రాళ్లపాడు చెరువును తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాళ్లపాడు పరిరక్షణ సమితి నాయకులు కాకుమాను మాధవరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు, తోకల వెంకటేశ్వర్లు, వై ఆనందమోహన్, సుధాకర్, సుభాన్, ప్రాజెక్టు ప్రాంత రైతులు పాల్గొన్నారు.