ఆ కార్యాలయంలో ఆ ముగ్గురు అధికారులు కొత్తవాళ్లే..మీకు తెలుసా...?
BSBNEWS - KANDUKUR 9/10/24
కందుకూరులో ఉన్న ఏ కార్యాలయంలో నైనా అధికారులు బదిలీ అయినపుడు ప్రజలకు తెలిసేలా మీడియా ద్వారా సమాచారం అందించేవారు అయితే కందుకూరు ఎంపీడీవో కార్యాలయంలో మొత్తం ముగ్గురు అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టి వారం రోజులు అయినా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో గా పి రత్నజ్యోతి, ఈ ఓ ఆర్ డి గా పి ఓబులేసు లు అక్టోబర్ 4 వ తేది, సూపర్నిండెంట్ వాక శ్రీనివాసులు రెడ్డి సెప్టెంబర్ 30వ తేదీ బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో ఉన్న అధికారులే ఇప్పుడు కూడా బాధ్యతలు చేపడుతున్నారని పలువురు తమ సమస్యలపై కార్యాలయాలకు వచ్చి అధికారులు కనిపించకపోవడంతో సెలవులు పెట్టారిమోనని అని అనుమానంతో వెనక్కి తిరిగిపోతున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు తమ సమస్యలు పరిష్కరించే అధికారుల గురించి తెలియపరచడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఎంపీడీవో కార్యాలయంలో ఏ అధికారి బాధ్యతలు చేపట్టినా దాదాపు పది రోజుల వరకు ఎవరికి తెలియకపోవటం ఆనవాయితీగా వస్తుంది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రతీ కార్యాలయం వైపు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు పడకుండా చూడాలని పలువురు ప్రజా సంఘాలుతో పాటు ప్రజలు కోరుకుంటున్నారు.