ఏఐవైఎఫ్ 15 మందితో నూతన కమిటీ ఎన్నిక
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నూతన కమిటీని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో ప్రతి పాత్రలో యువత పాత్ర కీలకమైందని దానిని అనుసరించి ముందుకు పోవాల్సిన బాధ్యత యువతరంపై ఉందని అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ద్వారా యువతరానికి ఉద్యమ పోరాటాల ద్వారా అనేకం సాధించిందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో అఖిల భారత యువజన సమాఖ్య పాత్ర కీలకంగా ఉందని తద్వారా దేశానికే వెన్నుముకగా యువత పాత్ర ఉందని నిరూపించిందని ఆయన అన్నారు. అనంతరం 15 మందితో ఏఐవైఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులుగా చేవూరు దుర్గాప్రసాద్ ప్రధాన కార్యదర్శులుగా బొజ్జ చంద్రమోహన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నిక కాబడిన మా కమిటీ ఎంతో బలంగా ఉందని రానున్న రోజుల్లో యువత పాత్ర పై పని చేస్తామని వారు అన్నారు. కందుకూరు నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పన లేక వలసబోతున్న పరిస్థితులు ఉన్నాయని మా కమిటీ దానిపై దృష్టి పెట్టి వలసలు తగ్గించే ప్రయత్నంలో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేని నిలదీస్తామని వారు అన్నారు. ఎన్నుకున్న కమిటీలో గౌరవ అధ్యక్షులుగా యర్రంశెట్టి ఆనందమోహన్, అధ్యక్షులుగా చేవురి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులుగా కలవకూరి హరిబాబు, బొల్లోజుల మణికంఠ, ఉప్పుటూరి శ్రవణ్ కుమార్, అముదాలపల్లి వెంకటేశ్వర్లు, ఆలూరి చంద్ర, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, దాసరి వెంకట్రావు, నిఖిల్, యాసిన్, వేణు గోపాల్, సాగర్, పెముల అనిల్, కోశాధికారి కోటకొండ రవికుమార్ లు ఉన్నారు.