మాలకొండలో హుండి లెక్కింపు
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలో వెలసియున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి మాలకొండ దేవస్థానంకు 14 వారములకు సంబంధించిన హుండీలను శుక్రవారం ఉదయం 8:30 గంటలకు కొండపైన కళ్యాణమండపం నందు తెరసి లెక్కించబడునని శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి మాలకొండ ఆలయ ఉప కమిషనర్ కెవి సాగర్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు కానుక రూపంలో హుండీలో వేసిన కానుకలను పగడ్బందీగా లెక్కించడం జరుగుతుందని. కానుక రూపంలో వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని దేవస్థానం అభివృద్ధికి భక్తుల వసతులకు సైతం వినియోగించబడుతుందని ఆయన అన్నారు.