మహిళల హక్కులకై నిత్యం పోరాడేది మహిళా సమాఖ్య
- ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్రనాయకురాలు వి. జయలక్ష్మి
BSBNEWS - కందుకూరుదేశంలో మహిళల రక్షణకు వారి హక్కులను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించి పోరాటాలు చేసేది ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు వి. జయలక్ష్మి అన్నారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయం ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కందుకూరు మండల జనరల్ బాడీ సమావేశం కారంశెట్టి ఇంద్రజ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు వి జయలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జెండాను ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి తుదసి రావమ్మ ఆవిష్కరించారు. అనంతరం ఏఐకేఎస్ రావుల వెంకయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం సనాతన ధర్మాన్ని తీసుకొని రావాలని ప్రయత్నాలు చేస్తుందని దానిని అరికట్టాల్సిన అవసరం అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు ధర్మము వలన మహిళలకు ఉన్న హక్కులు రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని అని అన్నారు. దానివలన మహిళలు సొంతంగా ఆలోచించే హక్కును కోల్పోవడంతో పాటు మహిళ ఇంటి నుండి బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం లో మంత్రిగా పనిచేస్తున్న అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను సైతం విమర్శించడానికి ధైర్యం చేశాడు అంటే బిజెపి ప్రభుత్వం దేశాన్ని నడిరోడ్డున పెట్టే ప్రయత్నం ఎంత దృఢంగా ఉంటుందో అర్థమవుతుందని వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం దేశ ప్రజలపై ముఖ్యంగా మహిళలపై ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు వి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన వాటిని అమలుపరచడంలో ప్రభుత్వాలు ఇతరమవుతున్నాయని ఆమె ఉద్యమ చేశారు. దేశంలో ఏదో ఒక మూలన మహిళపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అందుకు కారణం ప్రభుత్వ విఫలమైన అని ఆమె దుయ్యబట్టారు. బిజెపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని పైకి హిందుత్వం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ మహిళలను తొక్కిపడేసే ప్రయత్నంలో ఉన్నారని వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం మహిళపై ఉందని ఆమె అన్నారు. ఏ శాఖలోనైనా ఉద్యోగాలు చేసే మహిళలు పై పెత్తనం చలాయించే దిశగా ప్రభుత్వాలు ఉన్నాయని వాటికి నిదర్శనంగా అనేకం బయటపడుతున్నాయని ఆమె అన్నారు. చదువుకునే ఆడపిల్లలను సైతం కీచక ఉపాధ్యాయులు వదలటం లేదని వారిని శిక్షించాల్సిన ప్రభుత్వం వారికి మద్దతు పలుకుతూ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే మహిళలు చేయి చేయి కలిపి ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి సుదర్సి రావమ్మ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా కార్యదర్శి రావులకొల్లు లక్ష్మీ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కందుకూరు నాయకులు శైలజ, కల్పన, జ్యోతి అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.