నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై
BSBNEWS - KANDUKUR
2025 నూతన సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలో విధించిన పోలీస్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు జనవరి ఫస్ట్ వేడుకలు చేసుకోవాలని అలా చేయని యెడల కఠిన చర్యలు తీసుకోబడతాయని కందుకూరు పట్టణ ఎస్సై వి.సాంబశివయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంను ఆహ్వానిస్తూ డిసెంబర్ 31 వ తేదీ పలు రకాల పేర్లతో వేడుకలు నిర్వహిస్తున్నారని వాటిని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలని వేడుకల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా ఫిర్యాదు రూపంలో మా దృష్టికి తీసుకువస్తే సహించేది లేదని వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని ఆయన అన్నారు. అనంతరం కందుకూరు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.