అన్నదాతకు అండగా మాచవరం ఎస్బిఐ శాఖ
BSBNEWS - కందుకూరు
అన్నదాతకు అండగా మండలంలోని మాచవరం గ్రామం ఎస్బిఐ శాఖ ఉందని సూరంరెడ్డి చిరంజీవి రెడ్డి అన్నారు. గురువారం మాచవరం గ్రామంలోని పంచాయతీ వద్ద ఎస్బిఐ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల వ్యవసాయ శాఖ అధికారి వి.రాము, ఏపీఎం సురేష్, గ్రామ పెద్దలు సూరం చిరంజీవి రెడ్డి, దండే కోటేశ్వరరావు, జై చంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ రైతులకు కావలసిన అన్ని రకాల లోన్లు, డాక్రా గ్రూపులకు సంబంధించిన అన్ని రకాల లోన్లు ఇవ్వడాని కే సిద్ధంగా ఉందని అన్నారు. ఏపిఎం సురేష్ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులకు మాచవరం బ్రాంచ్ ద్వారా లోన్లు ఇప్పించడానికి సిద్ధమని చెప్పారు. ఏవో రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ద్వారా 50% సబ్సిడీ మీద రైతులకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కందుకూరు శాఖ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గేదలు, గొర్రెల పెంపకానికి కుటీర పరిశ్రమల ద్వారా కోటి రూపాయల దాకా లోను సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అనంతరం మాచవరం బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ వచ్చిన వారందరికీ అభినందనలు తెలియజేసి బ్యాంకును మాచవరంలో డెవలప్ చేసే దానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.