ఎరువుల దుకాణాలు తనిఖీ

0

 ఎరువుల దుకాణాలు తనిఖీ

 BSBNEWS - కందుకూరు 


పట్టణపరిధిలోని అన్ని ప్రైవేటు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల షాపులను మండల వ్యవసాయాధికారి వి. రాము ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనర్, డైరెక్టర్ కార్యాలయం గుంటూరు నుండి సహాయ వ్యవసాయ సంచాలకులు పి. శ్రీధర్ రెడ్డి, సాంకేతిక వ్యవసాయాధికారి కె.సుకుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని  ప్రవేటు డీలర్లు అందరూ షాపుల ముందు డీలర్ షాపు పేరు, లైసెన్సు నంబర్, అడ్రస్ బోర్డు చూపించాలని, తప్పనిసరిగా మీ యెుక్క లైసెన్సులో ఎరువులను సరఫరా చేసే కంపెనీల ఉత్పత్తులను ఫారం ఓ ద్వారా పొందుపరచుకోవాలని తెలిపారు. ఎరువులు ఎం ఆర్ పి రేట్లకు మాత్రమే విక్రయించాలని, రైతుకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, నోటీసు బోర్డులో అమ్మకపు రెట్లు, నిల్వ చూపించాలని, బిల్ బుక్ లో రైతు సంతకం, డీలర్లు సంతకం వుండాలని, పాస్ పుస్తకంలో రైతు విస్తీర్ణం బట్టి, బయోమెట్రిక్ ఆధారంగా వేలిముద్ర వేసుకొని ఎరువులను పంపిణీ చేయాలని తెలియజేసారు. నిబంధనలను పాటించని వారిపై ఎరువుల చట్టం 1985 ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తదుపరి ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా నిల్వ ఉన్న ఎరువులు, భౌతికంగా నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. పురుగుమందుల క్రయ,విక్రయాలు ఏరోజుకు ఆరోజు రిజిష్టర్ నందు నమోదు చేసుకోవాలని, రైతుకు రశీదు ఇవ్వాలని సూచించారు. విత్తనాలను అధీకృత లైసెన్సు పొందిన కంపనీ నుండి కొనుగోలు చేసి, మొలక శాతం కట్టి, రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. ఎవరైనా నిబంధనను పాటించకపోతే రైతులు గమనించి వ్రాత పూర్వకంగా మీ మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేసి, తగు సూచనలు సలహాలు పొందవచ్చనని తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)