యు.టి.ఎఫ్ స్వర్ణోత్సవ ప్రచార జాతను విజయవంతం చేయండి - కిలారి వెంకటేశ్వర్లు

0

 యు.టి.ఎఫ్ స్వర్ణోత్సవ ప్రచార జాతను విజయవంతం చేయండి 

BSBNEWS - కందుకూరు


ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న స్వర్ణోత్సవాలలో భాగంగా ప్రచార జాత డిసెంబర్ 30.12.2024 వ తేది సోమవారం సాయంత్రం 5:30 గంటలకు కందుకూరు చేరుకుంటుందని ఆ ప్రచార జాతను ఈ ప్రాంత కార్యకర్తలు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యు.టి.ఎఫ్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా జరిగిన సన్నాహక సమావేశంలో యు.టి.ఎఫ్ గౌరవాధ్యక్షులు కిలారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనవరి 5, 6,7, 8 తేదీల్లో కాకినాడలో యు.టి.ఎఫ్ స్వర్నోత్సవ సంబరాలు జరుగుతాయని ఆ సందర్భంగా జరిగే ప్రచార జాతాల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ఎక్కువ మంది కాకినాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో వివిధ ప్రముఖులతో పాటు విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎం తిరుపతి స్వామి, సంక్షేమ పథక డైరెక్టర్ జి.శ్రీనివాసులు, మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్.వెంకటేశ్వర్లు, జి. మాధవరావు,ఎం. మాధవరావు, ఎస్. జాలయ్య, సీనియర్ నాయకులు ముప్పరాజు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)