అంబేద్కర్ పై అమీషా వ్యాఖ్యలపై భగ్గుమన్న వామపక్షాలు
సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరసన
అమీషా తక్షణమే క్షమాపణలు చెప్పాలి వామపక్ష నాయకుల డిమాండ్
BSBNEWS - KANDKUR
భారత వ్యవస్థ పరిపాలన ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ను, అతను నిర్మించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన పార్లమెంటులో స్వయానా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై వామపక్షాలు భగ్గుమన్నాయి. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, సిపిఐ నియోజవర్గ కార్యదర్శి సురేష్ బాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మోహన్ రావు లు మాట్లాడుతూ నేటి సమాజం పరిపాలన ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తో సాధ్యమైందని అన్నారు. అలాంటి అంబేద్కర్ను ఆయన అందించిన రాజ్యాంగం ద్వారా కేంద్ర హోం మంత్రి పదవి పొందిన వ్యక్తి నిండు సభలో అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఈ భారత జాతికి తీరని ద్రోహం చేసినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ అజెండాను బిజెపి భారతదేశంలో అమలు చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేయటం హోం మంత్రి స్థాయికి తగదని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి భారత ప్రజలందరికీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌస్ బాషా, సిపిఐ నాయకులు ఆనందమోహన్, నత్త రామారావు, దుర్గాప్రసాద్, బాల బ్రహ్మచారి, ఉప్పుటూరి మాధవరావు, కోటేశ్వరరావు, నరసయ్య, సిపిఎం నాయకులు నాంచార్లు, రామ్మూర్తి, పవన్, వెంకటేశ్వర్లు మాలకొండ రాయుడు తదితరులు పాల్గొన్నారు.