ఇంటి నివాసాల మధ్య మద్యం షాపును తొలగించండి - సిఐటియు

0

 ఇంటి నివాసాల మధ్య మద్యం షాపును తొలగించండి - సిఐటియు

BSBNEWS - వలేటివారిపాలెం 

మండలంలోని పోకూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్ నగర్ ప్రక్కనే ఇటీవల ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ల ఆధ్వర్యంలో శుక్రవారం కందుకూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సిఐ వెంకట్రావు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ కాలనీవాసులంతా కూలినాలి చేసుకుని తన కుటుంబాలను పోషించుకోవలసి వస్తుందని, కాలనీ ప్రక్కనే మద్యం షాప్ ను ఏర్పాటు చేస్తే వచ్చిన కూలి డబ్బులు మొత్తం మద్యం షాప్ కే దళితులంతా సమర్పించాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పుడు ఏర్పాటు చేసిన షాపు మహిళలు బహిర్భూమికి వెళ్లే ప్రదేశంలో ఏర్పాటు చేశారని, మద్యం బాబులు ఆగడాలు మహిళలపై  పెరుగుతాయని పేర్కొన్నారు. ఆ ప్రక్కనే చర్చి కూడా ఉందని తెలిపారు. ఈపాటికే ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని స్థానిక శాసనసభ్యులకు కూడా విన్నవించుకున్నామని తెలిపారు. కాలనీ ప్రక్కనే కాకుండా మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దీనిపై స్పందించిన సీఐ 20 రోజులలో అక్కడ నుండి మరో ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ప్రజాసంఘాల నాయకులు జీవీబీ కుమార్, జీ.వి, ఆ గ్రామ ఎంపీటీసీ గౌరవ సలహాదారులు నూక తోటి వీరనారాయణ, కాలనీవాసులు, కెవిపిఎస్ నాయకులు పర్రే భాస్కరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దువ్వూరి జాన్, చేవూరు లోకేష్ తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)