కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను భర్తరఫ్ చేయాలి

0

కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను భర్తరఫ్ చేయాలి

BSBNEWS - కందుకూరు


పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ని అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి పదవి నుండి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విశాల ఐక్యవేదిక  డిమాండ్ చేస్తుందని ఐక్యవేదిక కన్వీనర్ కల్లగుంట మోహనరావు అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ మాట్లాడినందుకు నిరసనగా ఆదివారం కందుకూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మాట్లాడిన ఐక్యవేదిక నాయకులు అంబేద్కర్ ని అవహేళనగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా ని భర్తరఫ్ చేయాలని అమిత్ షా భారత ప్రజలకి క్షమాపణ చెప్పాలని, భారత ప్రజలకి స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాత్రత్వాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని సమస్త ప్రజలు కాపాడుకోవాలని తెలిపారు. ఈ నిరసన ర్యాలీలో ఏ ఏ డి అసోసియేషన్ నుంచి చిరంజీవి రామారావు, బి టి ఏ ఉపాధ్యాయ సంఘం నుంచి కల్లగుంట మోహన్ రావు, షేక్ అబ్దుల్లా, మాల మహానాడు ఉద్యోగుల సంఘం నుంచి శ్రీరాములు కట్ట రమేష్, సిపిఎం నుంచి జి వెంకటేశ్వర్లు ఎస్.కె గౌస్,  సిపిఐ నుంచి సురేష్ బాబు మాలకొండయ్య ఆమ్ఆద్మీ పార్టీ నుంచి నేతి మహేశ్వర రావు,   కాంగ్రెస్ పార్టీ చింతర బోయిన నరేష్, విసికె పార్టీ నుంచి ఆదినారాయణ, అడ్వకేట్స్ అసోసియేషన్ నుంచి కిషోర్, చార్వాక, అంబేద్కర్ బుద్ధిష్ట్ అసోసియేషన్ నుంచి గాండ్ల హరిప్రసాద్, మల్లికార్జున్, సామాజిక ఉద్యమకారులు పాలేటి కోటేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, యువజన సంఘాల నుంచి సూర్యనారాయణ, సిఐటియు నుంచి కుమార్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)