పొగాకు లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు చేపట్టి నాణ్యమైన పొగాకు పండించాలి-డాక్టర్.కృష్ణశ్రీ.

0

 పొగాకు లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు చేపట్టి నాణ్యమైన పొగాకు పండించాలి 

- డాక్టర్.కృష్ణశ్రీ.

BSBNEWS - KANDUKUR 



 గురువారం జాతీయ పొగాకు పరిశోధన సంస్థ కందుకూరు నందు పొగాకు బోర్డు వారి ఆద్వర్యంలో పొగాకులో చేపట్టవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై దక్షిణ ప్రాంత తేలిక నేలలు, నల్ల రేగడి నేలలపై పొగాకు రైతులకు, సిబ్బంది కి శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దక్షిణ ప్రాంత నేలల  పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్ డాక్టర్.కృష్ణశ్రీ మాట్లాడుతూ రైతు సోదరులు పొగకులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు చేపట్టి నాణ్య మైన పొగాకు పండించాలని తెలిపారు. దీనికోసం పొగాకు పంటకు ముందు పచ్చి రొట్ట పైరు సాగుచేయాలని కోరారు. నాట్లు వేసేటప్పుడు నాణ్యమైన నారును మరీ ముఖ్యంగా ట్రే విధానం ద్వారా సాగుచేసిన నారును వాడాలి. దీనివలన పంట అంతా ఒకేసారి పంటకు వస్తుందని తెలిపారు. పొగాకు ప్రధాన పొలంలో ఎరువులను సమతుల్యంగా వాడాలని, మరీ ముఖ్యంగా పొటాష్ ఎరువు వాడాలని కోరారు. దీనివలన పొగాకు లో నాణ్యత వస్తుందని తెలిపారు. పొగాకు లో విచ్చల విడిగా పురుగు మందులు వాడకూడదని అవసరమైన అప్పుడే సిఫార్సు చేసిన మందులు వాడాలని కోరారు. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పురుగుల , తెగుళ్ల నివారణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాస్త్ర వేత్తలు రైతు సోదరులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. పొగాకు సాగు తో పాటు సామాజిక అంశాల పై అవగాహన కల్పించారు. అనంతరం దామోదర్  మేనేజర్ నూతన టెక్నాలజీ లో భాగంగా ఆకు అల్లే పరికరాన్ని రైతు సోదరులు కోసం ప్రదర్శించారు. డ్రోన్ విధానం లో పురుగు మందుల పిచికారీ ని కూడా ప్రదర్శించారు. దీని ద్వారా కార్మికుల మీద ఆధారపడడం తగ్గుతుందని తెలిపారు. పక్వానికి వచ్చిన ఆకులనే రెలచాలని, పొగాకు బారన్ లో పరిది కి మించి అల్లిన కర్రలను పెట్టకూడదని , కురోమీటర్. ఖచ్చితంగా వాడాలని దీని వలన అగ్ని ప్రమాదాలు నివారించ వచ్చు అని తెలిపారు. గ్రేడు చేసే సమయం లో అన్య పదార్థాలు తీసివయాలని చెప్పారు. పొగాకు బెళ్ళు కట్టేటపుడు తేమ లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొగాకు బోర్డు గుంటూరు నుంచి మేనేజర్ ప్రొడక్షన్, రీజినల్ మేనేజర్ కృష్ణ శ్రీ, మేనేజర్ ఎక్సటెన్షన్ దామోదర్, మేనేజర్ మార్కెటింగ్ & ఎక్సపోట్స్ శ్యాం ప్రసాద్, సిటీఆర్ఐ కందుకూరు హెడ్ అనురాధ, ఇతర శాస్త్ర వేత్తలు ఇతర కంపెనీ ప్రతినిధులు బోర్డు సిబ్బంది, రైతు సోదరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)