రాళ్లపాడు ఆయకట్టు పంట పొలాలకు ప్రత్యామ్నాయంగా నీరు
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - KANDUKUR
కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు రైతులకు ప్రత్యామ్నాయంగా మోటర్ల ద్వారా నీరు అందిస్తున్న పనులను ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. గత పది రోజుల నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటు మరమ్మత్తు పనులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్న సందర్భంలో పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతుల పంట పొలాలకు సరిపోవటం లేదని తెలుసుకున్న ఆయన సమస్యను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివ నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. పంటలు ఎండిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి మెగా సంస్థ ద్వారా పోలవరం డ్యామ్ వరద నీటిని పంపింగ్ కు ఉపయోగించే పెద్ద పెద్ద మోటర్ల ద్వారా పంట కాలువలకు నీరు విడుదల చేసి రైతుల పంటలు ఎండిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైతుల పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి మోటార్ల ద్వారా పంటపొలాలకు నీరు అందించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం కృతజ్ఞతలు తెలియజేశారు.