విద్యార్థులకు 10వ తరగతి మెటీరియల్ పంపిణీ

bsbnews
0

 విద్యార్థులకు 10వ తరగతి మెటీరియల్ పంపిణీ

BSBNEWS - వలేటివారిపాలెం 

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థిని ,విద్యార్థులకు ఎస్ టి యు చొరవతో చిన్నమ్మ పాలెం నివాసి చల్ల గొలుసు నరసింహ ఆర్థిక సహాయంతో పదవ తరగతి మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున మాట్లాడుతూ ఈ మెటీరియల్ ను  విషయ నిపుణులచే తయారు చేసిందని, విద్యార్థులకు మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని మాట్లాడారు. ఎంఈఓ రవికుమార్ మాట్లాడుతూ 7 సబ్జెక్టులకు సంబంధించిన విషయాలను ఒకే ఒకే పుస్తకంలో ఇవ్వటం జరిగినదని, ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని పాఠశాలకు, పాఠశాల సిబ్బందికి, మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు కమల్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్ టి యు మండల శాఖను అభినందించారు. ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు మాట్లాడుతూ ఈ పంపిణీ కార్యక్రమానికి ఆర్థిక చేయూతనిచ్చిన సల్లగొలుసు నరసింహారావుని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా అధ్యక్షులు అశోక్ బాబు, ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు రవీంద్ర, చిన్నయ్య, మండల అధ్యక్షులు కేపీ జాన్సన్, ముల్లూరు మల్లికార్జున్, సిహెచ్ వి.రమణ మూర్తి, పి.మనోహర్ , టి.తిరుపాలు, ఎస్కే బ్రహ్మయ్య, శ్యామ్, వెంకారెడ్డి ,గోపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, రమణయ్య, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)