బి ఎస్ బి న్యూస్ 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన తల తోటి మస్తాన్
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో టిడిపి నాయకులు, శ్రీజయనిధి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ తలతోటి మస్తాన్ తన గృహంలో బి ఎస్ బి న్యూస్ ఛానల్ 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాకు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, ప్రభుత్వాలకు, అధికారులకు, ప్రజలకు ప్రతినిత్యం వారధిలా కుటుంబాలను సైతం పక్కనపెట్టి పనిచేయడం అందరివల్లా కాదని ఆ వృత్తిని ఎంచుకొని ముందుకు సాగుతున్న ప్రతి ఒక్క మీడియా ప్రతినిధికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బి ఎస్ బి న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేట్ వార్తలు ఇవ్వడమే కాకుండా ప్రజా సమస్యలను ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తెలియపరుస్తూ ముందు సాగుతున్న బి ఎస్ బి న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బి ఎస్ బి న్యూస్ ఛానల్ కి భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పెరిగేలా ముందు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ బి న్యూస్ ఛానల్ MD యర్రంశెట్టి ఆనందం మోహన్, శ్రీరామ్ నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.